వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గంగాదేవిపల్లి ఆదర్శ గ్రామాన్ని నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు ఎర్రం లింగం గారు మరియు నందిపేట్ మండల సర్పంచ్‌లు సందర్శించారు.*
*100% అక్షరాస్యత, సంపూర్ణ మద్యపాన నిషేధం, పూర్తి పారిశుధ్యం, స్వయం సమృద్ధి మరియు ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధిలో గంగాదేవిపల్లి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది.*
*ఈ సందర్భంగా గ్రామంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుధ్య నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, స్వయం సమృద్ధి విధానాలను పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు.*
*గంగాదేవిపల్లి స్ఫూర్తితో నందిపేట్ మండల గ్రామాలను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేద్దాం.



