खबर की मुख्य बातें
- ఆత్మకూరు, నవంబర్ 16 ( కోటకొండ హరికిరణ్-పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే…
- సోమవారం నెల్లూరులోని సంతపేటలో తన నివాసంలో అనంతసాగరం, మర్రిపాడు, ఆత్మకూరు రూరల్ మండలాలకు చెందిన నూతన ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- అనంతరం నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను మంత్రి అభినందించారు.
రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం
కార్యకర్తల కృషి, త్యాగాలే విజయానికి పునాది.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
నూతన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో మంత్రి ఆనం దిశానిర్దేశం
ఆత్మకూరు, నవంబర్ 16 ( కోటకొండ హరికిరణ్-పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరులోని సంతపేటలో తన నివాసంలో అనంతసాగరం, మర్రిపాడు, ఆత్మకూరు రూరల్ మండలాలకు చెందిన నూతన ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను మంత్రి అభినందించారు. ప్రజలు అందించిన విజయాన్ని పదవులుగా కాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే బాధ్యతగా భావించాలని సూచించారు.పార్టీ కార్యకర్తల అహర్నిశల కృషి, నాయకుల సమష్టి ప్రయత్నాలే కూటమి విజయానికి పునాదులని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కార్యకర్తలు ప్రదర్శించిన ఐక్యత, పట్టుదల అభినందనీయమన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించేలా నాయకత్వం కృషి చేస్తుందని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని వివరించారు.పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిరానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా సమన్వయంతో పనిచేయాలని, సాధ్యమైన చోట పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు.అభివృద్ధికి ప్రాధాన్యతఆత్మకూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో రహదారులు, తాగునీరు, సాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేయాలని సూచించారు.ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేయాలని ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, ఏఎంసీ, పీఏసీఎస్ అధ్యక్షులు, వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
