ఆంధ్రప్రదేశ్: హైకోర్టు చెనికల హర్షవర్ధిని మరియు చెనికల మనోహర్ వర్సెస్ స్టేట్ కేసులో పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే దంపతులకు ఆరు నెలల కూలింగ్ పీరియడ్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన జంట గత ఏడాది వివాహం చేసుకుని, మనస్పర్థల కారణంగా విడిగా ఉండగా, ఫ్యామిలీ కోర్టు ఆరు నెలలు వేచి ఉండాలని చెప్పింది. దంపతులు హైకోర్టును ఆశ్రయించి, ఆ కాలాన్ని మినహాయించాలని కోరారు.
హైకోర్టు జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ తీర్పులో, సుప్రీంకోర్టు అమర్‌దీప్ సింగ్, అమిత్ కుమార్, శిల్పా శైలేష్ కేసుల తీర్పులను సూచిస్తూ, 6 నెలల వేచి ఉండే కాలం కేవలం మార్గదర్శకం మాత్రమే అని, ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయించవచ్చని పేర్కొంది. భార్యాభర్తల మధ్య భవిష్యత్తులో కలసి జీవించే అవకాశం లేకపోతే, మానసిక వేదన పెంచే విధంగా కాలయాపనం చేయడం అన్యాయం అని హైకోర్టు తీర్పు స్పష్టం చేసింది.
ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఫుల్ బెంచ్ శిక్షా కుమారి వర్సెస్ సంతోష్ కుమార్ కేసులో కూడా ఇలాంటి మినహాయింపును అంగీకరించింది. ఈ తీర్పులు హిందూ వివాహ చట్టం సెక్షన్ 13-B కింద పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడంలో చట్టబద్ధమైన మార్గదర్శకాలను మరింత స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి.
Video Link: https://pavanlawchambers.blogspot.com/2026/06/mutual-consent-divorce-cooling-period-waiver.html


