పున్నమి ప్రతినిధి,తిరుచానూరు, జూలై 28
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం ఉడిపి శ్రీ ఆడమరు మఠం పిఠాధిపతి శ్రీ విశ్వప్రియ తీర్థ శ్రీపాద స్వామీజీ దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ సురేష్, అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.


