కడప జిల్లా బీసీ భవనంలో జిల్లా అధ్యక్షులుగా పాలకొండ దేవస్థానం చైర్మన్ గా నియమించినటువంటి బుర్రి రెడ్డయ్య యాదవ్ ని కడప జిల్లా యాదవ అధ్యక్షునిగా జాతీయ అధ్యక్షులు బుస గాని లక్ష్మయ్యయాదవ్ ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాదేవి గంగయ్య యాదవ్ , ప్రముఖుల యాదవుల సమక్షంలో 25 సంవత్సరాలు యాదవ సంఘం లో ఎన్నో సేవా కార్యక్రమాలు నందలూరు మండలంలో,జిల్లాస్థాయిలో కార్యక్రమాలు చేసినందుకుగాను గుర్తింపుగా డాక్టర్ కుర్ర మణి యాదవ్ కు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గా ఆదివారం ఎన్నుకోవడం జరిగిందని కుర్ర మణి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను గుర్తించి ఈ బాధ్యత ఇచ్చినప్రతియాదవులందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
ఈ కార్యక్రమంలో నందలూరు మండలం యాదవ సంఘం సభ్యులు,తాటిసుబ్బరాయుడు యాదవ్ గొబ్బిళ్ళ సుబ్బరాయుడుయాదవ్,లక్ష్మీనారాయణ యాదవ్ భారతాలశ్రీధర్ యాదవ్, బయనబోయిన భాస్కర్ యాదవ్, శేషయ్య యాదవ్, తుంటి సుధా యాదవ్, కేశవ యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




